నాని మదర్ సెంటిమెంట్.!

నాని మదర్ సెంటిమెంట్.!

Published on Feb 18, 2013 1:20 PM IST

Nani-With-Mother

ప్రతి ఒక్కరికీ అమ్మతో చాలా క్లోజ్ అటాచ్ మెంట్ ఉంటుంది. కానీ హీరో నాని మాత్రం దీనికి డిఫరెంట్. ఒకే డైలీ తెలుగు న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన అమ్మగారు తనకి ఎంత ధైర్యాన్ని, స్పూర్తిని ఇచ్చిందో తెలిపారు.

“మా అమ్మ విజయలక్ష్మి అంటే చాలా ఇష్టం. ఆమె నా ప్రతి సినిమాని మూడు సార్లు చూస్తుంది. మొదటిసారి నన్ను బిగ్ స్క్రీన్ పై చూడటానికి, రెండవసారి సినిమా ఎలా ఉందా అని, మూడవ సారి నాకు ఏమన్నా సూచనలు ఇవ్వడం కోసం ఇలా మూడు సార్లు చూస్తారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఈగ’ సినిమాలు ఆమెకి బాగా నచ్చాయి. నేను చనిపోకుండా ఉండే సినిమాలు చేయమని చెబుతుంటుందని” అన్నాడు.

నాని సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు అన్న దాని గురించి చెబుతూ ‘ నేను అంత మంచి స్టూడెంట్ ని కాదని అమ్మకి తెలుసు. నాకు సినిమాల మీద ఎంత మక్కువ ఉండేదో ఆమె గమనించేది, అందుకే నేను డైరెక్టర్ అవుతాను అని అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంది. నా మొదటి జీతంతో ఆమెకి ఓ రింగ్ తీసిచ్చాను. హీరోగా మొదటి సినిమాకి సైన్ చేసినప్పుడు నాకు 25,000 ఇచ్చారు అది తీసుకెళ్ళి మా అమ్మకిస్తే ఆమె ఆనందానికి అవధుల్లేవని’ అన్నాడు.

నానిలోని మరో సాఫ్ట్ కోణాన్ని చూడటం బాగుంది. మీరేమంటారు ఫ్రెండ్స్?

తాజా వార్తలు