కృష్ణ వంశీ చిత్రంలో ఖరీదయిన సూట్ ధరించిన నాని

Nani1
నాని త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో రానున్న చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రానికి “పైసా” అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ఓల్డ్ సిటీ మోడల్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అయన ఖరీదయిన సూట్ ఒకటి వేసుకొని చిత్రీకరణలో పాల్గొన్నారు. 4.5 లక్షల విలువయిన ఈ సూట్ ఫస్ట్ లుక్ ని నాని ఈరోజు విడుదల చేశారు. ఈ పాట డిసెంబర్లో దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంది. గతంలో ఈ చిత్రం హైదరాబాద్లోని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మీద నడుస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా ఇది ఒక నిజమయిన రాజకీయ నాయకుడిని లక్ష్యం చేసుకుని తెరకెక్కించారని వచ్చిన వార్తలను ఖండించారు. కేథరిన్ తెరెసా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద నిర్మించారు. మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి.

Exit mobile version