నాని ఈ ఉగాదికి ‘వి’ మూవీతో దిగనున్నాడు. నాని కెరీర్ లో మొదటిసారి సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నాడు. నాని కిల్లర్ గా ఎందుకు మారాడు?, ఎవరిని చంపుతున్నాడు? అనేది వి మూవీ అసలు కథ. మరో హీరో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. కిల్లర్ నానిని పట్టుకోవడానికి వచ్చిన సీరియస్ పోలీస్ గా సుధీర్ చేస్తున్నాడు. కాగా నేటి సాయంత్రం ఈ మూవీలోని ఓ స్నిక్ పీక్ వీడియో విడుదల చేయనున్నారు.
కాగా ఈ అనౌన్స్మెంట్ కొరకు వి మూవీలోని నాని లుక్ ఒకటి విడుదల చేశారు. ఈ లుక్ లో నాని చాల భిన్నంగా మరియు సీరియస్ గా ఉన్నారు. వి మూవీలో నాని బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని ఈ లుక్ చూస్తే అర్థం అవుతుంది. వి మూవీకి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.