ముంబైలోని పెద్ద స్టుడియోలో మన చిన్న హీరో

hero-nani
‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘ఈగ’ సినిమాలతో మంచి నటుడిగా నిరూపించుకున్న నాని ఇప్పుడు దర్శకుల మొదటి ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం కృష్ణ వంశీ ‘పైసా’, సముద్ర ఖని ”జెండా పై కపిరాజు ‘ చిత్రాల్లో నటిస్తున్నాడు .తాజాగా ‘బ్యాండ్ బాజా బారాత్’ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు . భారతదేశంలోనే అగ్రగామి సంస్థ అయిన యశ్ రాజ్ స్టూడియోస్ ఈ రీమేక్ ద్వారా సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించనుంది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం ఒప్పుకున్న నాని ఆ సినిమా కోసం పని ప్రారంభించారు.

ఇటివలే ముంబైలో యశ్ రాజ్ స్టూడియోస్ అధిపతి ఆదిత్య చోప్రాని కలుసుకుని రాబోయే ఈ చిత్రం గురించి చర్చించారు. “ఇప్పుడే అదిత్య చోప్రా గారిని కలుసుకున్నాను. చాలా సేపు మాట్లాడుకున్నాం. అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. నూతన ఆరంభాలు….” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ ట్రిప్ లో భాగంగా కాస్ట్యూమ్ ట్రైల్స్, ఫోటో షూట్స్ కూడా జరిగాయి. అంతేకాక అక్కడ జరిగిన మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ”వాళ్ళు నా కొలతలు సరిగ్గా షారుఖ్ కొలతలతో సరిపోయాయి అని చెప్పారు. నేను నా
​రేమ్యునరేషన్ కుడా ఒకటే అయినా పర్లేదు అని చెప్పానని” నాని జోడించాడు. మూవీ త్వరలో మొదలుకానుంది. తారలు తదితర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version