బ్యాండ్ బాజా బారత్ మొదలు పెట్టిన నాని

బ్యాండ్ బాజా బారత్ మొదలు పెట్టిన నాని

Published on May 27, 2013 3:53 PM IST

Nani

రైజింగ్ హీరో నాని తమిళంలో రీమేక్ చేయనున్న ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా కోసం వర్క్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో చెన్నై లో ప్రారంభంకానుంది. గోకుల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. తమిళంలో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి హీరోయిన్ ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ సినిమాని అధికారికంగా కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. ఈ సినిమాతో నానికి తమిళంలో కూడా మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు