శేర్వాని మోడల్ గా కనిపించనున్న నాని


నాని త్వరలో కృష్ణ వంశీ చిత్రంలో కనిపించనున్నారు. రమేష్ పుప్పళ్ళ ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ మూవీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కృష్ణ వంశీ ” ఈ చిత్రానికి మేము ఇంకా పేరు నిర్ణయించలేదు 70% చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ చిత్రంలో నాని ఓల్డ్ సిటి నుండి వచ్చిన శేర్వాని మోడల్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అద్దంపట్టేలా ఉండబోతుంది. చరణ్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జగన్ గురించో మరే నాయకుడి గురించో కాదు డబ్బుల కోసం మనిషి ఎంత దిగాజరుతున్నాడు అనే అంశం మీద ఉండబోతుంది” అని అన్నారు. కేథరీన్ తెరెసా ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది.

Exit mobile version