నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా ‘వి’ మూవీపై అంచనాలు మాములుగా లేవు. నాని సీరియల్ కిల్లర్ గా సీరియస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుండగా, మరో హీరో సుధీర్ నానిని వెంటాడే పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ ఓ రేంజ్ లో ఉంది.
‘వి’ మూవీ ఉగాది కానుగా ఈనెల 25న విడుదల కానుంది. ఇప్పటికే హీరో నాని డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఐతే నాని ‘వి’ సందడి ఇంకా మొదలుకాలేదు. భారీ ఎత్తున ట్రైలర్ విడుదల చేసి సినిమాపై హైప్ మరో స్థాయికి తీసుకెళ్లాలని నాని ప్రణాళికలో ఉన్నారట. ఇక ట్రైలర్ కూడా టాలీవుడ్ ప్రముఖ హీరోతో లాంచ్ చేయించాలని ఆయన ప్లాన్. కాబట్టి వి ట్రైలర్ విడుదల తరువాత ఆ సినిమా సందడి పూర్తి స్థాయిలో మొదలుకానుంది. ఇక ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.