క్రిటిక్స్ రూమర్స్ కి డైరెక్టర్ పూర్ రేటింగ్

క్రిటిక్స్ రూమర్స్ కి డైరెక్టర్ పూర్ రేటింగ్

Published on Apr 15, 2020 1:05 PM IST

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై వస్తున్న పుకార్లకు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఆమె తదుపరి చిత్రం సమంత తో కాదని, ఒకవేళ ఆమెతో మూవీ కుదిరితే చెవుతాను అన్నారు. కాగా కొద్దిరోజులుగా సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి ఓ మూవీ చేయనున్నారు అని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది. అలాగే ఇది ఓ రీమేక్ అని కూడా వార్తలు వచ్చాయి. ఈ నిరాధారమైన రూమర్స్ పై నందినిరెడ్డి సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు.

ఆమె నెక్స్ట్ మూవీని మహానటి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ స్వప్న దత్ నిర్మిస్తున్నారని, అలాగే అది రీమేక్ కాదు స్ట్రైట్ మూవీ అని చెప్పారు. ఈ రూమర్స్ కి ఆమె కేవలం ఐదుకి గాను ఒక రేటింగ్ ఇచ్చారు. మీ రూమర్స్ లో పసలేదు కొత్తగా ఆలోచించి మంచి రేటింగ్ తెచ్చుకోండి అని సవాలు విసిరారు. కాగా గత ఏడాది ఈమె సమంత తో కొరియన్ మూవీ మిస్ గ్రానీ ని ఓ బేబీ గా తీసి బంపర్ హిట్ అందుకుంది.
https://twitter.com/nandureddy4u/status/1250281150242643969

సంబంధిత సమాచారం

తాజా వార్తలు