నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య తన తరువాత సినిమాని కూడా లైన్ లో పెట్టారు. తన కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చాలా ముఖ్యమైనవి. ఈ సినిమాలతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ రెండు చిత్రాలను డైరెక్ట్ చేసింది బి.గోపాల్. ఆ రకంగా బాలయ్యది, ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే బి.గోపాల్ తో తన 107వ సినిమాని బాలయ్య చేయబోతున్నాడు.
కాగా ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం అవుతుందట. అన్నట్టు మంచి యాక్షన్ కథతోనే బి.గోపాల్ మళ్లీ డైరెక్ట్ చేయనున్నాడు. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి చేస్తోన్న సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.