మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మాస్ మసాల ఎంటర్టైనర్ ‘ఎవడు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ‘ఎవడు’ సినిమా విడుదలైన 4 రోజుల్లో ఒక్క నైజాంలోనే 6.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొదటి వారం చివరికల్లా 9-10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ చిత్ర టీం రేపటి నుంచి ఏపిలోని అన్ని ఏరియాల్లో విజయ యాత్ర నిర్వహించనున్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్ర పోషించడం మరియు అల్లు అర్జున్ ఎపిసోడ్ సినిమాకి మరింత ప్లస్ అవ్వడంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.