కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే మూడు డైలాగ్స్ కట్ చెయ్యమని వారు సూచించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంపై ప్రొడక్షన్ టీం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మించారు. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఆల్బంలోని కొన్ని పాటలు బాగా ఫేమస్ అయ్యాయి. కామెడీ, యాక్షన్ అంశాలు కలగలిపిన మాస్ మసాల ఎంటర్టైనర్ గా ‘భాయ్’ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యనున్నాడు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమాకి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.