కింగ్ అక్కినేని నాగార్జున కౌన్ బనేగా క్రోర్‌పతి అనే ఒక టెలివిజన్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడనే వార్తని నిన్ననే తెలియజేశాం. ఈ విషయం గురించి మేము తాజాగా మరో ఒక హాట్ న్యూస్ ని తెలియజేస్తున్నాం. ఈ టీవీ షో కోసం నాగార్జున ఓ ఫాన్సీ అమౌంట్ అందుకున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం 40 ఎపిసోడ్స్ కోసం 3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
ఈ టీవీ ఈవెంట్ కి నాగార్జున ఒక స్టార్ పవర్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యాత పోస్ట్ ని నాగార్జున ఇక్కడ చేయనున్నారు. ప్రస్తుతం ఈ టీవీ షోకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రోగ్రాం కి స్పాన్సర్స్ గా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మా మరియు సోనీ వారు ఈ ప్రోగ్రాంని రిచ్ గా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ షో కి మంచి రేటింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.