త్వరలో న్యూ యార్క్ వెళ్లనున్న నాగ్ – నయనతార

త్వరలో న్యూ యార్క్ వెళ్లనున్న నాగ్ – నయనతార

Published on Oct 1, 2012 2:53 PM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున మరియు నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టొరీ’. త్వరలోనే ఈ జంట ఈ చిత్ర చిత్రీకరణ కోసం న్యూ యార్క్ వెళ్లనున్నారు. ఈ చిత్ర స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యు.ఎస్ లో జరగబోయే ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ అక్టోబర్ చివరివారంలో లేదా నవంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది.

గతంలో ‘సంతోషం’ సినిమాతో నాగార్జున హిట్ ఇచ్చిన దశరథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున సరికొత్త లుక్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను నవంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు