మోడీ బాటలోకి టాలీవుడ్ ‘కింగ్’?

మోడీ బాటలోకి టాలీవుడ్ ‘కింగ్’?

Published on Mar 24, 2014 11:27 AM IST

Nagarjuna-to-get-a-good-pri
ఎన్నికల సమయం దగ్గర పాడుతుండే కొద్దీ సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. కొంతమంది తమకు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తుంటే, కొంతమంది ఏమో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. ఇప్పుడు అదే రాజకీయాల బాటలో టాలీవుడ్ టాప్ హీరో కింగ్ నాగార్జున కూడా ఎంటర్ కానున్నారు. గతంలో కాంగ్రెస్ కి కాస్త మద్దతుగా ఉన్న నాగార్జున ఈ సారి బిజెపి వైపు అడుగులేస్తున్నట్టుగా కనపడుతోంది. అందులో భాగంగా ఆయన ఈ రోజు బిజెపి ప్రచార సారధి, ప్రధాన మంటి అభ్యర్థి అయిన నరేంద్ర మోడీని కలవడానికి అహ్మదాబాద్ బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మోడీతో కలిసి ముచ్చటించనున్నారు.

మోడీని కలవడం కోసం రెండు రోజుల క్రితమే వెంకయ్య నాయుడుని కలిసి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇన్ని రోజులు రాజకీయాలంటే దూరంగా ఉన్న నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే నాగార్జున రాజకీయాల్లోకి రావడానికి సంప్రదింపులు జరుపుతున్నారా? లేక తన బంధువుల కోసం మంతనాలు జరుపుతున్నారా? అనే ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం లోపు సమాధానం దొరికే అవకాశం ఉంది.

తాజా వార్తలు