ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నాగవంశీ క్లారిటీ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వార్-2’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన తారక్, తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఈ స్టార్ హీరో.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలపై నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ నెక్స్ట్ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తో చేయనున్నాడని.. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభిస్తారని.. 2026 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని నాగవంశీ తెలిపాడు. దీంతో పాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కంటిన్యూ అవుతాయని.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడం ఖాయమని ఆయన తెలిపారు.

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేయాలని భావించామని.. కానీ ‘రామాయణ’ గ్లింప్స్ చూశాక.. దానిని మించే రేంజ్‌లో ఈ ప్రోమో ఉండాలని వారు సమయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పక్కా ప్లానింగ్‌తో ఎగ్జిక్యూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారనేది స్పష్టమవుతుంది.

Exit mobile version