ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!

Andhra king thaluka

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘పప్పీ షేమ్’ అంటూ వచ్చిన ఈ క్రేజీ సాంగ్‌ను రామ్ పోతినేని స్వయంగా పాడాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం రామ్ లిరిసిస్ట్ అవతారం ఎత్తాడు. ఇక ఇప్పుడు ఈ రెండో సాంగ్‌తో సింగర్‌గా మారాడు. భాస్కరభట్ల అందించిన లిరిక్స్‌ను వివేక్-మెర్విన్ ఫుల్ ఎనర్జీగా క్యాచీ ట్యూన్స్‌తో కంపోజ్ చేశారు. కాలేజీలో వచ్చే ఈ పాటలో రామ్ స్టెప్స్ కూడా అదిరిపోయాయి.

ఇక ఈ సినిమాలో ఆంధ్ర కింగ్‌గా కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు. ఆయన అభిమానిగా రామ్ మనకు కనిపిస్తాడు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version