డమరుకం ఆడియో వేడుకలో భావోద్వేగానికి లోనయిన నాగ్

డమరుకం ఆడియో వేడుకలో భావోద్వేగానికి లోనయిన నాగ్

Published on Sep 11, 2012 12:55 AM IST


అక్కినేని నాగార్జున మాములుగా శాంతమయిన వ్యక్తి పబ్లిక్ గా ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు. కాని ఈరోజు అయన “డమరుకం” ఆడియో వేడుక లో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.ఎటువంటి పరిస్థితుల్లో అయిన తనకు అండగా నిలబడిన అభిమానులకు అయన కృతజ్ఞతలు తెలిపారు. “పెద్ద దర్శకులు” మరియు “చిన్న దర్శకులు” అని తేడాలు చూసే వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. “నా కెరీర్ లో నేను మూడు సార్లు పాతాళంలో కూరుకుపోయి తెరిగి పైకి రాగలిగాను నాకు ఇలాంటి అభిమానులు ఉన్నంతవరకు నేను ఎంత పడిపోయినా లేచి నిలబడగలను. ఇక్కడ పెద్ద దర్శకులు, చిన్న దర్శకులు అని తేడా లేదు ప్రతిభ గల దర్శకులు మాత్రమే ఉన్నారు. ఇలా చిన్న దర్శకుడు అనిపించుకున్న వాళ్లే గతంలో భారీ హిట్ లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి” అని అన్నారు. “శిరిడి సాయి” చిత్రానికి వస్తున్న స్పందనకు అయన హర్షం వ్యక్తం చేశారు. “డమరుకం” ఆడియో వేడుకకు పరిశ్రమ పెద్దలు అందరు విచ్చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, వినాయక, చార్మీ, నాగ చైతన్య అఖిల్ తదితరులు ఈ వేడుకలో మాట్లాడి నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు