హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న నాయక్


రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “నాయక్” హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుపెట్టుకుంది. ఈ చిత్రం కొన్ని రోజులు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకున్న తరువాత చిన్న షెడ్యూల్ కోసం కోల్కత్తా వెళ్ళింది. అక్కడ షెడ్యూల్ ముగించుకొని ఈరోజు నుండి హైదరాబాద్లో మరో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. సారధి స్టుడియోస్లో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్ నిర్మించారు. కాజల్ మరియు అమలపాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం ఆసక్తికరమయిన విషయం. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వి వి వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుచుతున్నట్లు తెలుస్తుంది. నాయక్ చిత్రం 2013 జనవరి 9న విడుదలకు సిద్దమవుతుంది.

Exit mobile version