మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘నాయక్’ సినిమా ఆంద్ర ప్రదేశ్లో మంచి బుజినెస్ జరుగుతోంది. అలాగే కృష్ణా జిల్లాలో మంచి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది. సినిమా విడుదలైన 7 రోజులకి (అనగా 9 నుంచి -15 వరకు) మొత్తంగా ఒక్క కృష్ణాలో 1.47 కోట్ల షేర్ సాదించింది. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేసాడు. అలాగే చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలా పాల్ ఆడి పాడారు. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమా అన్ని ఎరియాల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.