మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాని సెన్సార్ వారికి పంపించారు ఈ రోజు సాయంత్రంలోపు సెన్సార్ రిపోర్ట్ బయటకి రావచ్చు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ – అమలా పాల్ జోడీ కట్టారు. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా సంక్రాతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్ మొదటి సారి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు.