భారత ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా ఎన్.శంకర్

భారత ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా ఎన్.శంకర్

Published on Sep 4, 2013 8:30 AM IST

N-Shankar
తెలుగులో కాస్త విప్లవాత్మక సినిమాలు ఎక్కువగా తీసే డైరెక్టర్ ఎన్. శంకర్. ఆయన ఇండియా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల్లో ఒకరుగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో మొత్తం 17 మంది ఉంటారు. వీరు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలను చూసి వాటిలో ఉత్తమమైన చిత్రాలను సెలెక్ట్ చేసి ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్’ సినిమా విభాగంలో ఆస్కార్ కి పంపుతారు.

ఎన్. శంకర్ గతంలో రెండు సార్లు నంది అవార్డు కమిటీ సభ్యునిగా పనిచేసాడు. అలాగే నేషనల్ సినిమా అవార్డ్స్ జ్యూరీలో మరియు గోవా ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్ గా పనిచేసాడు. భారత ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ ఈ నెల 17 – 21 వరకు హైదరాబాద్ లో కొన్ని సినిమాలను చూస్తారు. అందులో భాగంగా ‘మిథునం’, ‘జగద్గురు ఆదిశంకర’, ‘చదువుకోవాలి’ సినిమాలను వారు చూడనున్నారు.

తాజా వార్తలు