కొన్ని చిత్రాలు వారి జీవితాన్నే మార్చి వేస్తాయి. వారికి పదేళ్లకు సరిపడా ఇమేజ్ తెచ్చిపెడతాయి. అలాంటి చిత్రమే 2018లో వచ్చిన కెజిఫ్ చాప్టర్ వన్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కెజిఫ్ చాప్టర్ 2 అక్టోబర్ లో విడుదల కానుంది. కాగా ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీపై అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
మొదట ఎన్టీఆర్, ఆ తరువాత మహేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రంతో కమిటై రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇక మహేష్ సైతం ప్రశాంత్ నీల్ కలిసిన మాట వాస్తవమే కానీ, సినిమాలకు సంబందించిన ఒప్పందం జరగలేదని స్పష్టత ఇచ్చారు. ఐతే ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో చేసే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. దీనితో వారు ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో మూవీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం కావచ్చు అంటున్నారు.