టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇప్పుడు మైత్రీ కూడా రంగంలోకి దిగడంతో ఈ చిత్రంపై వారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తుండగా విద్యాసాగర్ నాగవెల్లి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.