ఆవిడే నాకు స్పూర్తిదాయకం – శ్రియ

ఆవిడే నాకు స్పూర్తిదాయకం – శ్రియ

Published on Sep 29, 2013 7:40 PM IST

shriya-saran
తెలుగు, తమిళ ఇండస్ట్రీలోని అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కొట్టేసిన భామ శ్రియ సరన్. సుమారు 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రియ చివరిగా తెలుగులో ‘పవిత్ర’ సినిమాలో కనిపించింది.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ తనని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతూ ‘నాకు ఎంతో స్పూర్తిని, ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ. ఆమె ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది, ఎప్పుడూ కోప్పడదు, అలాగే ఇంటి పనులను ఎంతో ఇష్టంగా చక్కబెడుతూ చాలా పద్దతిగా ఉండేలా చూసుకుంటుంది. అలాగే ఎలాంటి సందర్భాల్లో అయినా చాలా గుండె నిబ్బరంతో ఉంటుంది. నన్ను మా అమ్మ డార్లింగ్ అని పిలుస్తుంది. నాకు అంతకన్నా గొప్ప ప్రశంశ ఇంకేమీ లేదని అనిపిస్తుందని’ తెలిపింది.

అలాగే తను ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోనని బాగా లైట్ తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం శ్రియ సరన్ అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమాలో నటిస్తోంది. ఇందులో నాగార్జునకి జోడీగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు