నా డ్రీం ప్రాజెక్ట్ 3 భాషల్లో తీస్తా – బొమ్మరిల్లు భాస్కర్

నా డ్రీం ప్రాజెక్ట్ 3 భాషల్లో తీస్తా – బొమ్మరిల్లు భాస్కర్

Published on Jan 28, 2013 4:35 PM IST

Bommarillu-bhaskar

‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘ఆరెంజ్’ లాంటి సున్నితమైన కథాంశాలతో సినిమాలు తీసిన భాస్కర్ తన స్టైల్ మార్చి తీసిన సినిమా ‘ఒంగోలు గిత్త’. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, కృతి కర్బందా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత భాస్కర్ చేయనున్న సినిమా గురించి చెబుతూ ‘ నేను 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్న నా డ్రీం స్టొరీతో తదుపరి సినిమాతో చేయనున్నాను. నేను బాధలో ఉన్నప్పుడు ఈ కథ కోసం ఒకటి లేదా రెండు లైన్స్ రాసుకునేవాన్ని. ఆ కథ తెరపైకి రావాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది నా డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీయలనుకున్తున్నానని’ తెలిపాడు.

తాజా వార్తలు