‘విరాటపర్వం’ రాక ఇప్పట్లో లేనట్టే !

‘విరాటపర్వం’ రాక ఇప్పట్లో లేనట్టే !

Published on Sep 14, 2020 8:06 PM IST

రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే 80% చిత్రకరణ పూర్తయింది. అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదే ఉంది. దీనికితోడూ కరోనా రావడంతో, సినిమా మరింత ఆలస్యం అయింది. సరే తిరిగి షూట్ చేద్దామనుకుంటే.. అంతలో రానా పెళ్లి చేసుకుని.. షూట్ కి గ్యాప్ ఇచ్చాడు. అయితే రానా ఈ ఏడాది మొత్తం షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చేశాడట.

ఈ మేరకు ఇప్పటికే డైరెక్టర్ కి కూడా క్లారిటీ ఇచ్చాడు. పైగా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కూడా ఈ సినిమా కోసం రానా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదట. ఆల్ రెడీ ఒప్పుకున్న ఓ హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకి డేట్స్ ముందుగా ఇవ్వాలట. ఆ సినిమాల షూటింగ్స్ వ్యవహారం ముగిశాక.. తిరగ్గా విరాటపర్వంకు వస్తాడట రానా. అంటే దాదాపు మరో సంవత్సరం దాకా విరాటపర్వం ఖాళీనే. ఇక పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం రానుంది.

తాజా వార్తలు