మోస్ట్ అవైటెడ్ “ప్రభాస్ 22” అనౌన్స్మెంట్ వచ్చేసింది.!

మోస్ట్ అవైటెడ్ “ప్రభాస్ 22” అనౌన్స్మెంట్ వచ్చేసింది.!

Published on Aug 18, 2020 7:28 AM IST

మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడైతే “మిర్చి” సినిమా నుంచి “బాహుబలి” లాంటి భారీ సినిమా మొదలు పెట్టాడో అప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు తన సినిమాలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అనే మాటనే మర్చిపోయారు. ఒక్కో సినిమా సినిమాకు వస్తున్న గ్యాప్ ఏమో కానీ ఆ సినిమాలకు జస్ట్ ఏదన్నా అప్డేట్ వస్తే బాగుండు అని వారు ఎంత గానో ఆశ పడుతున్నారు.

కానీ ఇప్పుడు నుంచి వారికి ఆ పరిస్థితి నుంచి పెద్ద బ్రేకే దొరకనుంది అని ప్రభాస్ టీం అలెర్ట్ చేసారు. అలా ఈరోజు ఉదయం ఒక అదిరిపోయే అప్డేట్ ను అందిస్తామని చెప్పుకొచ్చారు. అలా చెప్పినట్టుగానే ఇప్పుడు 7 గంటల 11 నిమిషాలకు ఆ భారీ అనౌన్స్మెంట్ ను తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే “తనాజీ” దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆదిపురుష్” అనే భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.

“ఏ” అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్ ను ను సహా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉంచారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కటౌట్ కు సరిపడా మరో భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ రెడీ అవుతుందని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషల్లో తెరకెక్కించనుండగా గుల్షన్ కుమార్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు