యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా బిజినెస్ లెక్కలు వినిపిస్తున్నాయి. అలా వాటితోనే తమిళ హక్కులకు సంబంధించి కూడా గట్టి టాకే వినిపించింది.
అక్కడ బడా నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. మరి వీరు కూడా భారీ రేట్ తోనే కొన్నారని టాక్ కూడా వచ్చింది. అయితే మరి దీనిపై లేటెస్ట్ ఇన్ఫో ఒకటి తెలుస్తుంది. ఇరు నిర్మాణ సంస్థల మధ్య డీల్ చర్చలు ముగిశాయని అది కూడా భారీ ధరకే జరిగినట్టు తెలుస్తుంది.
అంతే కాకుండా ఆల్రెడీ అడ్వాన్స్ కూడా లైకా వారు ఇచ్చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితమైన ఫిగర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు కానీ 40 కోట్ల పై చిలుకే అక్కడి హక్కులు పలికాయని ఓ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సాలిడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.