మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగవ సీజన్ ను కూడా ముగించే దిశగా వెళ్తుంది. అయితే ఇక ఈ నేపథ్యంలో ఈ సరికొత్త వారపు ఎలిమినేషన్స్ కు గాను నామినేషన్స్ కూడా మంచి రసవత్తరంగా సాగాయి. అయితే ఈ నామినేషన్స్ లో ఒక్కొక్కరు పలు కారణాలు చెప్పి అవతల వాళ్ళని నామినేట్ చేసుకున్నారు. అయితే కొంతమంది విషయంలో మరికొందరు సరైన క్లారిటీ లేకుండానే నామినేట్ చేసారు.
అయితే మొదట నుంచి కొనసాగుతూ వస్తున్న మోనాల్ గజ్జర్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అవినాష్ విషయంలో కుండ బద్దలు కొట్టేసింది అని చెప్పాలి. అతన్ని నామినేట్ చేసినపుడు రెండు పాయింట్స్ చెప్పింది. ఒకటి ఇంటి రూల్స్ పాటించలేదని అయితే దానికి సరైన వివరాన్నే అవినాష్ ఇచ్చాడు. కానీ మరో పాయింట్ మాత్రం అవినాష్ విషయంలో నిజమే అని చెప్పొచ్చు.
అవినాష్ తాను అందరినీ వీక్ అంటాడు కానీ ఒక సిట్యుయేషన్ ను తీసుకోవడంలో అవినాష్ వీక్ అని మోనాల్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. అవినాష్ చాలా విషయాల్లో ఇన్ సెక్యూర్ ఫీల్ అవ్వడం పలు ఎక్స్ పోజ్ అయ్యింది. తాను ఎలా అయినా సరే ఇంట్లోనే ఉండాలి అనే పాయింట్ మీద ఉండిపోయాడు తప్పితే గేమ్ పరంగా జెన్యూన్ గా ఉన్నట్టు ఎవరికీ అనిపించి ఉండకవచ్చు. అందుకే మోనాల్ కూడా సరిగ్గా అదే విషయాన్ని రైజ్ చేసి పాయింట్ అవుట్ చేసింది.