లక్ష్మి ప్రసన్న ఫిల్మ్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మంచువారి మల్టీ స్టారర్ సినిమా నేడు ఫిలింనగర్ లో లాంచనంగా ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ఈ చిత్రంలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, హన్సిక, ప్రణీత నటిస్తున్నారు. విష్ణు, మనోజ్ ఈ సినిమాకు నిర్మాతలు. కోన వెంకట్, గోపి మోహన్, బి.వి.ఎస్ రవి కధను అందించారు.
మొదటి సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు క్లాప్ నివ్వగా, కే రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఆనందంగావుంది. మంచి రైటర్స్, హీరోలు, టెక్నీషియన్స్ దొరికారు. పకడ్బంది స్క్రిప్ట్ తో కడుపుబ్బ నవ్వించే కామెడితో సినిమా ఉంటుంది. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ని ఖరారు చెయ్యవలసివుందని”అన్నారు.