మోహన్ బాబు, సునీల్ కలిసి నటించనున్నారా?

మోహన్ బాబు, సునీల్ కలిసి నటించనున్నారా?

Published on Dec 23, 2012 9:15 PM IST

mohan-babu-and-sunil
ప్రస్తుతం వస్తున్న పుకార్లు నిజమైతే 2007లో అక్షయ్ కుమార్, నానా పటేకర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వెల్ కమ్’ సినిమా తెలుగు రీమేక్లో డా. మోహన్ బాబు, సునీల్ కలిసి నటించనున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2013 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ‘లక్ష్యం’ సినిమా డైరెక్టర్ శ్రీ వాస్ డైరెక్ట్ చేసే అవకాశమున్న ఈ సినిమాని మోహన్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడు.

గతంలో మోహన్ బాబు బాలీవుడ్ సినిమా ‘టాక్సీ నెం 9211’ రీమేక్ గా తెరకెక్కిన ‘గేమ్’ సినిమాలో నటించారు. ఈ యాక్షన్ కామెడీ మూవీ కోసం డా. మోహన్ బాబు, సునీల్ మొదటిసారి కలిసి నటించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన నటీనటుల పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు