ఈ మధ్యనే ఒక టీ వి ఛానల్ వారు ప్రసారం చేసిన చర్చ లో వ్యాఖ్యత “అడవి రాముడు” చిత్రం గురించి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ లో “అడవి రాముడు” ఒక కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి చిత్రం అని చెప్పారు. అదే చిత్రం ఇప్పుడు విడుదల అయితే ఆ చిత్రం అన్ని కేంద్రాలలో 150 రోజులు పూర్తి చేసుకుంటుంది అని అన్నారు. ఈ చర్చ లో పాల్గొన్న డిస్ట్రిబ్యుటర్స్ మాట్లాడుతూ టి.వి మరియు సాటిలైట్ హక్కులకు మరియు మళ్ళి మళ్ళి చూసే ప్రజల వల్ల నటులకు నిర్మాతలకి మంచి జరిగుండేది అని అన్నారు. చిత్ర పరిశ్రమ మీద ఉన్న ఆసక్తి మరియు వెంటవెంటనే చిత్రాలు నిర్మించటం ద్వారా పరిశ్రమ ఆరోగ్యవంతంగా ఉంటుంది అని అన్నారు