నీకు నాకు డాష్ డాష్ చిత్ర విడుదల తేది ఖరారు

నీకు నాకు డాష్ డాష్ చిత్ర విడుదల తేది ఖరారు

Published on Apr 10, 2012 12:40 AM IST

తేజ రాబోతున్న చిత్రం “నీకు నాకు డాష్ డాష్” ఏప్రిల్ 13న విడుదలకు సిద్దమయ్యింది. గతంలో ఈ చిత్రాన్ని నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఏప్రిల్ 12 న విడుదల చెయ్యాలని అనుకున్నారు కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల ఒక్క రోజు వాయిదా వేశారు. ప్రిన్స్ మరియు నందిత ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మద్యం మాఫియా నేఫధ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. యశ్వంత్ నాగ ఈ చిత్రానికి సంగీతం అందించారు అనూప్ రూబెన్స్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మొట్టమొదటి సారిగా రెడ్ ఎపిక్ కెమెరాని ఈ చిత్రం కోసం ఉపయోగించారు

తాజా వార్తలు