“నీకు నాకు డాష్ డాష్”కి కత్తిరింపులు

“నీకు నాకు డాష్ డాష్”కి కత్తిరింపులు

Published on Apr 15, 2012 5:55 PM IST

తేజ తాజా చిత్రం “నీకు నాకు డాష్ డాష్” చిత్రం ఏప్రిల్ 13న విడుదల అయ్యింది. మొదటి రోజు ప్రేక్షకుల స్పందన చుసిన తేజ చిత్ర రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలను కత్తిరించారు. దీని ఫలితంగా రెండవ అర్ధ భాగంలో తనికెళ్ళ భరణి,ఉత్తేజ్ సన్నివేశాలు మరియు పాట కత్తిరించారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం దీనివల్ల చిత్రం కాస్త బాగా అనిపిస్తుంది అంటున్నారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్ర పరిస్థితిని మారుస్తుందా? లేదా? అనేది చూడాలి. తేజ దర్శకత్వంలో ప్రిన్సు మరియు నందిత ప్రధాన తారలుగా వచ్చిన ఈ చిత్రానికి యశ్వంత్ సంగీతం అందించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు.

తాజా వార్తలు