తారక రత్న చిత్రం నుండి తప్పుకున్న శ్రద్ద దాస్

తారక రత్న చిత్రం నుండి తప్పుకున్న శ్రద్ద దాస్

Published on Apr 10, 2012 9:28 PM IST

తారక రత్నతో నటిస్తున్న అని తన ఆనందం వ్యక్తం చేసి ఒక్క రోజు కూడా కాకముందే శ్రద్ద దాస్ ని ఎ చిత్రం నుండి తప్పించారు. ఈ చిత్రం కోసం ఈ నటి నిన్న ఫోటో షూట్ లో కూడా పాల్గోనింది. కొన్ని వ్యక్తిగత మరియు వృత్తిపరమయిన కారణాల మూలాన ఈ చిత్రం నుండి శ్రద్ద దాస్ ని తప్పించినట్టు తెలుస్తుంది. అవి ఏంటి అనేది ఈ నటి స్పష్టంగా తెలుపలేదు. ఈ చిత్రం లో తారక రత్న రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది కాకుండా శ్రద్ద చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో “రేయ్” మరియు మహేష్ బాబు కజిన్ శివ చిత్రం లో నటిస్తున్నారు.

తాజా వార్తలు