వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సాయి ధర్మ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేయ్’. ఇటీవలే ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో శ్రద్ధా దాస్ గాయపడిన సంగతి తెలిసిందే. కంటికి జరిగిన ప్రమాదంలో 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ గాయం నుండి కోలుకుని నిన్న మళ్లీ షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధా దాస్ మళ్లీ ప్రమాదానికి గురైంది. ఒక పెద్ద లైట్ కట్టర్ తన తలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ టీం వెంటనే స్పందించటంతో వెంటనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ తతంగం అంతా బ్యాంకాక్ లో జరగడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి గారి మేనల్లుడు హీరోగా నటిస్తుండగా సుబ్రా అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. శ్రద్ధా దాస్ రెండో హీరోయిన్ గా నటిస్తుంది. రేయ్ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!