రజినీకాంత్ తరువాత రాబోయే 3D చిత్రం ‘కోచాడైయాన్’. ఈ చిత్రం ప్రకటించిన దగ్గరి నుండి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ కూతురు డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రానికి నటీనటుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభన ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. భరతనాట్యం షోలతో బిజీగా ఉంటున్న ఆమె ఈ చిత్రంలో చేయడానికి అంగీకరించడం విశేషం. ఆమె గతంలో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన దళపతి చిత్రంలో రజినీకాంత్ తో కలిసి నటించారు. ప్రస్తుతం సౌందర్య మరియు రజినీకాంత్ కలిసి ముంబైలో రెహ్మాన్ తో ట్యూన్స్ కట్టించుకున్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కె. ఎస్ రవికుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!