గౌతం మీనన్ చిత్రంలో పాట పాడిన సమంత?

గౌతం మీనన్ చిత్రంలో పాట పాడిన సమంత?

Published on Apr 10, 2012 2:35 AM IST

తమిళ చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం సమంత తన రాబోతున్న చిత్రం “నీతానే ఎన్ పోన్వసంతం” చిత్రం లో ఒక పాట పాడబోతుంది. ఈ చిత్రం తెలుగులో “ఎటో వెళ్లిపోయింది మనసు” అనే పేరుతో నిర్మితమవుతుంది. ఈ పుకారు ప్రకారం గౌతం మీనన్ ఈ చిత్రంలో జీవ మరియు సమంతలను ఇళయరాజా స్వరపరిచిన ఒక పాటను పాడమని కోరినట్టు తెలుస్తుంది. ఈ జంట కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు అందులోనూ ఈ చిత్రానికి ఇళయరాజానే సంగీతం అందిస్తుండడంతో కాస్త ఇబ్బంది పడినట్టు కూడా తెలుస్తుంది. గౌతం మీనన్ వీరు ఇరువురిని ఒప్పించారు అని చెబుతున్నారు. ఇంకా ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే ఈ మధ్య చిత్రీకరణ కోసం లండన్ వెళ్ళినప్పుడే ఈ పాట రికార్డింగ్ పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని సమంత కాని గౌతం మీనన్ కాని దృవీకరించలేదు ఇది పుకారే అయి ఉండచ్చు కాని సమంత అభిమానులు మాత్రం ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు