“బాద్షా” గురించి మాట్లాడిన రూప వైట్ల

“బాద్షా” గురించి మాట్లాడిన రూప వైట్ల

Published on Apr 13, 2012 12:10 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ రాబోతున్న చిత్రం “బాద్షా”, ఈ చిత్రం ఈ వేసవిలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని భారీ చిత్రంగా మలచడం కోసం శ్రీను వైట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని విన్నాము. రచయితలు గోపి మోహన్ మరియు కోన వెంకట్ శ్రీను వైట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద గురించి చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల భార్య రూప వైట్ల కూడా ఈ చిత్రం గురించి మాట్లాడారు. ” శ్రీను ఈ చిత్రం గురించి చాలా కష్టపడుతున్నాడు అతన్ని ఇలా ఎప్పుడు చూడలేదు బాద్షా చిత్రం భారీగా ఉండబోతుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. “దూకుడు” చిత్రం తరువాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం ఇదే కావున అందరి కళ్ళు ఈ చిత్రం మీద ఉంటుంది. కాజల్ కథానాయికగా కనిపించబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం చాలా భాగం ఇటలీలో చిత్రీకరించనున్నారు.

తాజా వార్తలు