మెహెర్ రమేష్ డైరెక్ట్ చేయబోయే తరువాత చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన రిచా గంగోపాధ్యాయ నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె గతంలో వెంకటేష్ తో నాగవల్లి చిత్రంలో నటించారు. రిచా తమిళ్ లో ధనుష్ తో నటించిన ‘మయక్కం ఎన్న’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇదే కాకుండా శింబు తో నటించిన ‘ఒస్తి’ (దబాంగ్ రిమేక్) రేపు విడుదలవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘వారధి చిత్రంలో నటిస్తున్న రిచా బాలీవుడ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.