పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కోసం ప్రేక్షకులు
ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో టీజర్‌ను మేకర్స్ వదిలారు.
కేవలం ఆడియో టీజర్‌తోనే ఈ సినిమాపై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. అయితే, ఈ సినిమాను సందీప్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా
రూపొందించేందుకు పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో రవితేజ, స్టార్
డైరెక్టర్ త్రివిక్రమ్ వారసులు కూడా వర్క్ చేస్తున్నారు. రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ ‘స్పిరిట్’ చిత్ర
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
దీంతో సందీప్ రెడ్డి వద్ద టెక్నికల్ మెలకువలు నేర్చుకునేందుకు ఇద్దరు స్టార్ వారసులు ‘స్పిరిట్’లో జాయిన్ కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
