వంద వసంతాల కేవీ రెడ్డి

వంద వసంతాల కేవీ రెడ్డి

Published on Jul 1, 2012 4:18 PM IST

తెలుగు ప్రేక్షకులు చెప్పుకునే చిరస్మరణీయ చిత్రాలలో ఖచ్చితంగా చెప్పుకునే చిత్రాలు “దొంగరాముడు”,”శ్రీ కృష్ణార్జున యుద్ధం”,”జగదేకవీరుని కథ”,”మాయాబజార్” మరియు “పాతాళ భైరవి” . ఇలాంటి ఆణిముత్యాలను తెలుగు ప్రేక్షకులకు అందించి తెలుగు ప్రజల హృదయంలో నిలిచిపోయిన కేవీ రెడ్డి గారి జయంతి ఈరోజు. 1912 జూలై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో కదిరి వెంకట రెడ్డిగా జన్మించిన ఈయనకి ఈరోజు వందవ పుట్టినరోజు. 1939 లో “వందేమాతరం” చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసిన ఈయన 1942లో “భక్త పోతన” చిత్రంతో దర్శకుడిగా తెరకు పరిచయం అయ్యారు. క్రమ శిక్షణకు మారు పేరయిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించారు. “ఒకసారి కథ సిద్డం అయ్యాక అందులో ఎటువంటి మార్పులకు అవకాశామిచ్చేవారు కారు. అయన ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో అంతగా మమ్మల్ని ప్రోత్సాహించే వారు” అని కేవీ రెడ్డి గారి దగ్గర “దొంగరాముడు” చిత్రం నుండి సహాయకుడిగా పని చేసిన సింగీతం శ్రీనివాసరావు అన్నారు. కేవీ రెడీ గారు తెలుగు తెరకు “గుణసుందరి కథ” ,”శ్రీ కృష్ణ సత్య”, “సత్య హరిశ్చంద్ర”,”యోగి వేమన”,”పెద్దమనుషులు” వంటి పలు చిత్రాలను అందించారు. తెలుగు చిత్రసీమకు స్వర్ణయుగాన్ని అందించిన కేవీ రెడ్డి గారి వందవ జయంతి సందర్భంగా ఆయన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

తాజా వార్తలు