రామ్ కొత్త సినిమా రేపు ప్రారంభం

రామ్ కొత్త సినిమా రేపు ప్రారంభం

Published on Apr 11, 2012 7:26 PM IST

దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ ఆ తరువాత రెడీ సినిమాతో భారీ హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్నాడు. ఆ తరువాత మాస్క, కందిరీగ సినిమాలతో మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అతను నటించిన తాజా చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’ విడుదలకు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న చిత్ర ముహూర్తం ఇప్పటికే ప్రారంభం అవగా మరో సినిమాకి రేపు ముహూర్తం జరగనుంది. కందిరీగ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి రెడీ ఐపోయాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్ర ముహూర్తం రేపు జరగనుంది.

తాజా వార్తలు