మొదటివారంలో 26.92కోట్లు వసూళ్లు సాదించిన “రచ్చ”

మొదటివారంలో 26.92కోట్లు వసూళ్లు సాదించిన “రచ్చ”

Published on Apr 13, 2012 12:11 AM IST

రామ్ చరణ్ తేజ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “రచ్చ”. ఈ చిత్రం మొదటి వారం వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది నిర్మాతల ప్రకారం ఈ చిత్రం 26.92 కోట్లు వసూలు చేసింది. నైజాం ప్రాంతంలో మాత్రమే ఈ చిత్రం 7 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇంకా ఈ చిత్ర పరుగు మరి కొద్ది రోజులు కొనసాగనుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామ్ చరణ్ ని మరో మెట్టు ఎక్కించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర మళయాళ వెర్షన్ ఏప్రిల్ 13న విడుదల చెయ్యనున్నారు. నిర్మాతలు ప్రకటించిన వసూళ్ళు మీకోసం
ప్రాంతం వసూళ్లు

నైజాం 7.5 కోట్లు
సీడెడ్ 5.4కోట్లు
కృష్ణ 1.61కోట్లు
గుంటూరు 2.88కోట్లు
తూర్పు గోదావరి 1.77కోట్లు
పశ్చిమ గోదావరి 1.65కోట్లు
వైజాగ్ 2.44కోట్లు
నెల్లూరు 1.17కోట్లు
ఆంధ్రప్రదేశ్ మొత్తం 24.42కోట్లు
కర్నాటక 2.5కోట్లు
మొత్తం వసూళ్లు : 26.92కోట్లు

తాజా వార్తలు