“ఫ్రెండ్స్ బుక్” మీద భారీ ఆశలు పెట్టుకున్న ఆర్ పి పట్నాయక్

“ఫ్రెండ్స్ బుక్” మీద భారీ ఆశలు పెట్టుకున్న ఆర్ పి పట్నాయక్

Published on Apr 12, 2012 12:10 AM IST

తన రాబోతున్న చిత్రం “ఫ్రెండ్స్ బుక్” మీద ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ మీద మళ్ళ విజయ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది . ఈ చిత్రం మీద ఆర్ పి పట్నాయక్ చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. “ఈ చిత్రాన్ని చాలా కస్టపడి మరియు ఇష్టపడి చేశాం, యువతను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని ఆశిస్తున్నా” అని ఆర్ పి పట్నాయక్ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ పి పట్నయక్ సంగీతం అందించగా అభినందన్ ఛాయాగ్రహణం అందించారు. ప్రధాన పాత్రలు అన్ని నూతన నటులు పోషించారు.

తాజా వార్తలు