“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ

“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ

Published on Apr 15, 2012 5:55 PM IST

మరో రెండు గంటల్లో ఆడియో విడుదల చేసుకోబోతున్న చిత్రం “గబ్బర్ సింగ్” ఈ చిత్రానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.ప్రొద్దున నుండి నితిన్,నవదీప్ లాంటి హీరోలు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా “దేవుడు చేసిన మనుషులు” చిత్ర బృందం పూరి జగన్నాథ్,ప్రకాష్ రాజ్,రవి తేజ మరియు సుబ్బరాజు లు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “నేను కూడా అక్కడ ఆడియో విడుదల వేడుకలో పాల్గొనాల్సింది కాని “దేవుడు చేసిన మనుషులు” చిత్రం లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు తీయాల్సి ఉండి రాలేకపోతున్న నేను ఇంతకముందే పాటలు విన్నాను హరీష్ శంకర్ తన ఖాతాలో విజయాని జమ చేసుకున్నట్టే” అని పూరి జగన్నాథ్ అన్నారు. ” గబ్బర్ సింగ్ భారీ విజయం సాదించాలని గణేష్ బాబు ఈ చిత్రంతో మెగా ప్రొడ్యూసర్ అవ్వాలని ” రవి తేజ అన్నారు.

తాజా వార్తలు