రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా

రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా

Published on Apr 12, 2012 1:15 AM IST

జంజీర్ చిత్రంలో జయ బచ్చన్ పాత్రను ప్రియాంక చోప్రా చెయ్యబోతుంది.ఈ చిత్రం తో రామ్ చరణ్ బాలివుడ్ లో ప్రవేశించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ కోసం ఈయన ముంబై లో ఉన్నారు. చాలా కాలం క్రితం ప్రియాక చోప్రా విజయ్ సరసన తమిళంలో ఒక చిత్రంలో నటించింది. తెలుగు లో ఒక చిత్రం విడుదల కాలేదు. తను జాతీయ తార అయిపోయాక దక్షణాది నటుడితో కలిసి చెయ్యటం ఇదే తొలిసారి. దర్శకుడు అపూర్వ లాఖియ మరియు నిర్మాత అమిత్ మెహ్ర కొన్నాళ్లుగా ఈ చిత్రం గురించి ప్రియంకాను సంప్రదిస్తున్నారు ఈ వారంలోనే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మహి గిల్ మరియు అర్జున్ రాంపాల్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు