మంచి బాడీ ఉన్న తెలుగు హీరోలలో ప్రభాస్ ఒకరు. ఆయన రాజమౌళి తో చేయబోయే చిత్రం కోసం చాలా జాగ్రత్తలు తేసుకున్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమా కోసం కండలు తిరిగిన దేహ ధారుడ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారని, అది సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. దీని కోసం స్పెషల్ గా ఒక ట్రైనర్ ని కూడా పెట్టుకున్నట్లు, ప్రత్యేకమైన ఆహరం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ‘రెబల్’ మరియు ‘వారధి’ సినిమాలో బిజీగా ఉండగా రాజమౌళి ‘ఈగ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభం కానున్న ఈ సినిమాకి శోభు యార్లగడ్డ నిర్మాత. ప్రభాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘చత్రపతి’ మేజిక్ రిపీట్ అవుతుందని ఆశిద్దాం.