సునీల్ హీరోగా మారి అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాల తర్వాత కష్టపడి ఫ్యామిలీ ప్యాక్ గా ఉన్న తన బాడీని కష్టపడి సిక్స్ ప్యాక్ గా మార్చి చేసిన చిత్రం ‘పూలరంగడు’. అనూప్ రూబెన్స్ అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాదులోని కత్రియ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు విచ్చేసారు. ఈ చిత్ర ఆడియోలోని మొదటి పాటను ‘మిరపకాయ’ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మరియు ఆ చిత్ర రమేష్ పుప్పాల విడుదల చేసారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ సునీల్ హీరోగా రెండు సినిమాలు చేసిన తరువాత కూడా తను అడగిన వెంటనే మిరపకాయ్’ చిత్రంలో కమెడియన్ పాత్ర వేయడానికి ఒప్పుకున్నారని అన్నారు. దర్శకుడు దేవకట్ట ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే విడుదలైన ‘బిజినెస్ మేన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఈ పూలరంగడు అంతటి విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అచ్చిరెడ్డి తను చిన్ననాటి స్నేహితులమని వారు నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హీరో ఆది మాట్లాడుతూ మాక్స్ ఇండియా బ్యానర్ పై వచ్చిన ‘ప్రేమకావాలి’ చిత్రం లాగే ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం లాగే పూలరంగడు కూడా సునీల్ కెరీర్లో మర్యాద రామన్న-2 అవుతుందని అన్నారు. తన ఫిజికల్ ట్రైనర్ సలీం వల్లే తను సిక్స్ ప్యాక్ బాడీ సాధ్యమైందని హీరో సునీల్ అన్నారు. ప్రేమకావాలి తరువాత ఇదే బ్యానర్లో మళ్లీ చేస్తున్నందుకు చాలా అందంగా ఉందని ఈ సినిమా హీరొయిన్ ఇషా చావ్లా అన్నారు. అలాగే సుకుమార్, మంచు మనోజ్, గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీ రామ్, రామజోగయ్య శాస్త్రి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- మొదటి షో వివరాలు : కింగ్డమ్
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!
- ఓటిటికి షాక్.. డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అమీర్ లేటెస్ట్ సినిమా