అలియాస్ జానకి లో నిషా అగర్వాల్

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ తన మూడో చిత్రం ఒప్పుకున్నారు. గతం లో “ఏమైంది ఈ వేళ” మరియు “సోలో” చిత్రాలలో కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ భామ మూడో చిత్రంగా “అలియాస్ జానకి” చెయ్యబోతుంది.

ఈ చిత్రంలో మరొక కథానాయిక కూడా కనిపించబోతున్నారు ఇంకా ఈ పాత్రలో ఎవ్వరు చేయ్యబోతున్నారనేది తెలియలేదు. నీలిమ తిరుమల శెట్టి మరియు నగేష్ ముంత ఈ చిత్రాన్ని సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించబోతున్నారు సుజీత్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కానున్నారు వెంకట్ రాహుల్ ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఏప్రిల్ 25 మొదలయిన ఈ చిత్రం మే 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంతో పలు సాంకేతిక నిపుణులు పరిచయం కానున్నారు. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి , సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ గతంలో కీరవాణి వద్ద సహాయకుడిగా పని చేసాడు, ఎడిటర్ సతీష్ సూర్య గతం లో శ్రీకర్ ప్రసద్ద్ వడ్డా సహాయకుడిగా పని చేశారు.

Exit mobile version